ఇవాళ్టి నుంచి 'రైతన్న మీకోసం' కార్యక్రమం
AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి ఏడు రోజులపాటు 'రైతన్న మీకోసం' కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి 29 వరకు రైతుల ఇళ్లకు అధికారులు వెళ్లనున్నారు. రైతులు కొత్త పంటలు వేసేలా సూచనలు చేయనున్నారు. మార్కెట్ ధరలు, పంట మార్పిడి విధానంపై అవగాహన కల్పించనున్నారు. ప్రతి ఇంటికి అగ్రికల్చర్ అసిస్టెంట్‌తో పాటు ఆరుగురు సచివాలయం సిబ్బంది వెళ్లి సమాచారం సేకరించనున్నారు.