40 తులాల బంగారం చోరీ.. కేసు నమోదు
NGKL: కల్వకుర్తి పట్టణంలోని విద్యానగరంలో భారీ చోరీ జరిగింది. గత నెల 30న ఊరికి వెళ్లిన శ్రీనివాస శర్మ ఇంటికి తిరిగి వచ్చేసరికి, ఇంట్లో ఉన్న సుమారు 40 తులాల బంగారం, రూ. 6 లక్షల నగదు మాయమైనట్లు గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.