ఈనెల 14న పట్టుబడిన వాహనాలకు వేలం

ఈనెల 14న పట్టుబడిన వాహనాలకు వేలం

MHBD: వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 14న వేలంపాట నిర్వహించనున్నట్లు తొర్రూరు ఎక్సైజ్ సీఐ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు ఆదేశాల మేరకు స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు వేలంపాట ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ వేలంలో పాల్గొనే వారు ముందుగా 50 శాతం చెల్లించాలని కోరారు.