ఉమ్మడి జిల్లాలో నేటితో ముగియనున్న రేషన్ పంపిణీ

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చౌక ధరల దుకాణాల్లో రేషన్ పంపిణీ శనివారంతో ముగియనుంది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మూడు నెలల బియ్యం ప్రభుత్వం ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈనెల 1 నుంచి రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఇంతవరకు రేషన్ తీసుకోని లబ్ధిదారులు సమీప రేషన్ దుకాణాలను సంప్రదించాలని పౌర శాఖ అధికారులు సూచించారు.