రైతులు ఆందోళన చెందనవసరం లేదు: కలెక్టర్

రైతులు ఆందోళన చెందనవసరం లేదు: కలెక్టర్

PPM: జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎరువుల పంపిణీని పర్యవేక్షణ చేస్తున్నామని, ఎరువుల లభ్యత పంపిణీ విధానాన్ని పరిశీలించామని చెప్పారు. రైతులు యూరియా అధిక మొత్తంలో వాడరాదని కోరారు. అది పంటకు హానీ కలిగిస్తుందని పేర్కొన్నారు. ఎరువుల కోసం రైతులు ఆందోళన చెందనవసరం లేదన్నారు.