'POSH చట్టంపై మహిళలకు అవగాహన అవసరం'
SDPT: పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు ఉద్దేశించిన POSH చట్టం-2013పై ప్రతి మహిళకు అవగాహన ఉండాలని సిద్ధిపేట జిల్లా మహిళా సాధికారత కేంద్రం ప్రతినిధి ఏ. పద్మ పేర్కొన్నారు. వేధింపులకు గురైనప్పుడు మౌనంగా ఉండకుండా ధైర్యంగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చట్టంపై చైతన్యం కల్పించాలన్నారు.