89 శాతం సామర్థ్యంతో ఉన్న ఏపీ జైళ్లు: బండి సంజయ్‌

89 శాతం సామర్థ్యంతో ఉన్న ఏపీ జైళ్లు: బండి సంజయ్‌

ఏపీ జైళ్లు ప్రస్తుతం 89.33 శాతం సామర్థ్యంతో ఉన్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఆయన రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 106 జైళ్లలో 8,831 మంది ఖైదీలను ఉంచడానికి వీలుండగా ప్రస్తుతం అక్కడ 7,889 మంది ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న 1,332 జైళ్లలో 4,39,119 మందికిగాను 5,30,333 మంది ఉన్నట్లు వెల్లడించారు.