ఎవరి స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది: హరీష్ రావు

ఎవరి స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది: హరీష్ రావు

HYD: మాజీ సీఎం కేసీఆర్ స్థాయి ఏంటో, సీఎం రేవంత్ రెడ్డి స్థాయి ఏంటో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రసంగాన్ని 36 లక్షల మంది చూస్తే, సీఎం ప్రసంగాన్ని 4 లక్షల మంది చూశారన్నారు. ప్రజలు కేసీఆర్ పట్ల ఎంత గౌరవంగా ఉన్నారు, రెండున్నర ఏళ్లలో సీఎం స్థాయి ఎక్కడికి పడిపోయిందో అర్థమవుతుందన్నారు.