చింతలపూడిలో ప్రజలతో ఎమ్మెల్యే ప్రజా దర్బార్
ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎంతగానో దోహదపడుతుందని శాసనసభ్యులు రోషన్ కుమార్ పేర్కొన్నారు. ఇవాళ చింతలపూడి క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ విధానం వలన ప్రజల సమస్యలు తక్షణ పరిష్కారానికి ఉపయోగపడుతుందన్నారు.