ముఖ్యమంత్రిని కలిసిన కావలి ఆర్యవైశ్య నేతలు

రాష్ట్రంలో వివిధ పేర్లతో ఉన్న వైశ్యు లందరినీ ఆర్య వైశ్యులుగా పరిగణించాలని కోరుతూ ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారు. ఆర్యవైశ్య ఛైర్మన్ డుండి రాకేశ్, కావలి సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేశ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినతిని తప్పకుండా పరిశీలిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.