అమెరికాలో మేడ్చల్ వాసి మృతి
HYD: అమెరికాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బర్మింగ్ హోమ్‌లోని ఓ అపార్ట్ మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిగూడకు చెందిన సహజ రెడ్డి మృతి చెందింది. ఆమె న్యూయార్క్‌లో ఎంఎస్ చదువుతుంది. ఉడుముల జయకర్ రెడ్డి పెద్ద కుమార్తె సహజ రెడ్డిగా గుర్తించారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.