'ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు'

'ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు'

AKP: ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని మునగపాక తహసిల్దార్ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం నరేంద్రపురం గ్రామంలో సర్వే నంబర్ 19లో గల ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. దీనిని కొందరు ఆక్రమించినట్లు గుర్తించామన్నారు. అక్రమణలు తొలగించి బోర్డు ఏర్పాటు చేసామన్నారు. ఎవరైనా ఆక్రమిస్తే సహించేది లేదన్నారు.