'కామర్స్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి'

KNR: స్థానిక SRR కళాశాలలో కామర్స్ & బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం వారు కామర్స్ విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సులైన సీఏ, సీఎంఏల పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధి గుర్రం అశోక్ కుమార్ మాట్లాడుతూ.. డిగ్రీతోపాటు సీఏ, సీఎంఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులను పూర్తి చేసిన కామర్స్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.