పూడిక తీసి వదిలేశారు..!

KDP: మైదుకూరు పట్టణ పరిధిలో కేసీ కెనాల్ కాలువలో సాగునీటి విడుదలకు ముందు పూడికతీత పనులు చేపట్టారు. పనులు పూర్తయిన పూడిక మాత్రం తొలగించకుండా కాలువలకు ఇరువైపులా అలానే ఉంచారు. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వ్యర్థాలు తడిసి దుర్వాసన వెదజల్లుతున్నాయి. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.