మాజీ ఎమ్మెల్యే రాజీనామాకు ఆమోదం

CTR: వైసీపీ ప్రభుత్వంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడిగా వ్యహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన పూతలపట్టు అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మురళి మోహన్ చేతిలో ఓడిపోయారు. అలాగే రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోవడంతో సునీల్ కుమార్ తన పీసీబీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.