VIDEO: స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించిన DCP భాస్కర్
MNCL: రేపు జరగబోయే 3వ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చెన్నూరు మండలంలోని కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ను మంగళవారం మంచిర్యాల DCP భాస్కర్ పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్చాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని కోరారు.