ఎల్లారెడ్డి: 'ఆత్మ' ఛైర్మన్‌గా దశరథ్ నాయక్
KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ ఆత్మ బ్లాక్ రైతు సలహా కమిటీ ఛైర్మన్‌గా జరుపుల దశరథ్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం అధికారికంగా ప్రతిపాదనలు వెల్లడించారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కమిటీ పని చేయనుంది.