VIDEO: గుర్తుతెలియని మృతదేహం లభ్యం
BHPL: భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని అన్నారం సరస్వతి బ్యారేజీలో మంగళవారం గుర్తుతెలియని పురుషుడి మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు కాళేశ్వరం పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నేతృత్వంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.