చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం హర్షనీయం

KDP: చేనేత మగ్గాలకు 200 మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇవ్వడం AP ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లెలో గురువారం ఆయన మాట్లాడుతూ.. చేనేత గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్యుత్ అమలు చేయాలని ఆయన కోరారు.