నేడు సురవరం సంస్మరణ సభ

నేడు సురవరం సంస్మరణ సభ

KMM: సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ ఇవాళ ఖమ్మంలో నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు భక్తరామదాసు కళాక్షేత్రంలో సభ మొదలవుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తదితరులు పాల్గొంటారని వెల్లడించారు.