రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
NGKL: కల్వకుర్తి నియోజకవర్గం వంగూరు మండలం వెలుమల్లపల్లి గ్రామంలో శ్రీశైలం-హైదరాబాద్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలయ్య (60) అనే రైతు మృతి చెందాడు. పొలం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళుతున్న బాలయ్యను శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళుతున్న బొలెరో వాహనం డ్రైవర్ నిద్రమత్తులో ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.