పుట్టపాక పవన్‌కు జాతీయ చేనేత పురస్కారం!

పుట్టపాక పవన్‌కు జాతీయ చేనేత పురస్కారం!

BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక గ్రామానికి చెందిన గూడ పవన్‌ చేనేతలో ప్రకృతి రంగులతో వినూత్న ప్రయోగాలు చేసి జాతీయ యువ చేనేత అవార్డుకు ఎంపికయ్యాడు. బంతిపూలు, మల్లెపూలు, మంజిష్ట వేర్లు వంటి సహజ పదార్థాలతో రంగులు తయారుచేసి, మల్బరీ పట్టు దారంతో తేలియ రుమాల్ డిజైన్‌లో చీరలు నేస్తూ ప్రపంచపు చూపును ఆకర్షిస్తున్నాడు. వారసత్వంగా పొందిన మగ్గం పనికి కొత్త ఒరవడినిస్తూ, పవన్ చేనేతకు నూతన వెలుగును జోడించారు.