VIDEO: అమలాపురం రైతు బజార్లో ఉద్రిక్తత వాతావరణం

VIDEO: అమలాపురం రైతు బజార్లో ఉద్రిక్తత వాతావరణం

కోనసీమ: అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ రైతు బజార్లో ధరల పట్టిక కన్నా ఎక్కువకు అమ్ముతున్నారని వినియోగదారులు ఆదివారం ఉదయం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై వ్యాపారులు తిరగబడటంతో ఉద్రిక్తత నెలకొంది. మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించి నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.