VIDEO: చెత్త బండ్లను అడ్డుకొని డంపింగ్ యార్డ్ వద్ద నిరసన
NLG: చిట్యాల పురపాలక పరిధి, శివనేనిగూడెం శివారులో చెత్త డంపింగ్ యార్డ్‌ను తొలగించాలని గ్రామస్తులు బుధవారం ఆందోళన చేపట్టారు. అక్కడ చెత్త వేయడానికి వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన గుండాల నరేష్ గౌడ్, కన్నెబోయిన మహాలింగంలు కమిషనర్ శ్రీనుకు ఫోన్ చేసి సమస్యను తెలిపారు. కలెక్టర్‌కు ఫోన్ చేసి తెలుపగా కమిషనర్‌తో మాట్లాడుతానని చెప్పారు.