లాలాపేట నివాసానికి అందెశ్రీ పార్థివదేహం
TG: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇవాళ ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన పార్థివదేహాన్ని గాంధీ ఆసుపత్రి నుంచి లాలాపేట్ నివాసానికి తరలించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన నివాసంలో అందుబాటులో ఉంచనున్నారు. కాగా, అందెశ్రీ అంతిమ సంస్కారాలను రేపు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.