దీక్షా దివస్ స్ఫూర్తితోనే తెలంగాణ: ప్రభాకర్ రెడ్డి

దీక్షా దివస్ స్ఫూర్తితోనే తెలంగాణ: ప్రభాకర్ రెడ్డి

SRD: దీక్షా దివస్ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఉద్ఘాటించారు. సిద్దిపేటలో జరిగిన దీక్షాదివస్ కార్యక్రమంలో ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట సహాదుబ్బాక నియోజకవర్గం కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఉద్యమ నాయకుడు స్వర్గీయ సోలిపేట రామలింగారెడ్డి తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించారని స్మరించుకున్నారు.