‘కుంభమేళా కోసం చెట్లు నరుకుతారా?’
మహారాష్ట్రలో కుంభమేళా పనుల కోసం వేలాది చెట్లను నరకడంపై నటుడు సయాజీ షిండే ఫైర్ అయ్యాడు. నాసిక్‌లో సాధువుల వసతి కోసం 1,825 చెట్లను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. 'చెట్లు నరికి జనాన్ని ఎగతాళి చేయకండి' అంటూ మంత్రికి గట్టిగా నిలదీశారు. గత 8 రోజులుగా అక్కడ పర్యావరణవేత్తలు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు.