12,807 క్వింటాళ్లు సోయాబిన్ కొనుగోలు..!
KMR: మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో శనివారం ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నిన్నటి వరకు 286 మంది రైతుల నుంచి 12,807 బస్తాల పంటను కొనుగోలు చేసినట్లు సొసైటీ అధికారులు తెలిపారు. పంటను అమ్మకానికి తెచ్చే ముందు 2 శాతం కంటే తక్కువగా మట్టి శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రంలో అమ్మకాలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.