రైళ్లలో సూపర్ శానిటేషన్ సేవలు

రైళ్లలో సూపర్ శానిటేషన్ సేవలు

HYD: రైళ్లలో బేసిన్, టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. పలు రైళ్లలో దుర్గంధభరితమైన వాతవరణం నెలకొనటమూ తెలిసిందే. ఈ సమస్య పై సికింద్రాబాద్ ఎస్‌సీఆర్ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం సూపర్ శానిటేషన్ టీంను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చిన అన్ని రైళ్లను శుభ్రం చేస్తుంది.