అక్రమ ఇసుక రవాణాపై దాడి.. ట్రాక్టర్లు పట్టివేత

అక్రమ ఇసుక రవాణాపై దాడి.. ట్రాక్టర్లు పట్టివేత

WGL: సంగెం మండల కేంద్రంలో అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. గురువారం కక్కిరాలపల్లి నుంచి సంగెం వైపు ఇసుక రవాణా జరుగుతోందన్న సమాచారం మేరకు ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు ఇసుక ట్రాక్టర్లు, వాటి డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.