దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు

దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు

AKP: కశింకోట మండలంలో పలు గ్రామాల్లో మేకలు దొంగతనం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ స్వామి నాయుడు శుక్రవారం తెలిపారు. అనకాపల్లి మండలం కొత్తూరుకు చెందిన వంశీ, అరుణ్ తేజ్ దుర్గ నాయుడు కలిసి తాళ్లపాలెం, జోగారావుపేట గ్రామాల్లో మేకలు దొంగలించినట్లు తెలిపారు. దొంగలించిన మేకలను ఎలమంచిలి సంతలో అమ్మడానికి తీసుకు వెళుతుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు.