రంజాన్ తోఫా అందజేసిన ఎమ్మెల్యే
VZM: మైనారిటీ ముస్లింల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన స్పష్టం చేసారు. ఇవాళ ఉదయం బొబ్బిలి కోటలో ఆయన రంజాన్ తోఫా పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ముస్లింలంతా రంజాన్ ఘనంగా నిర్వహించుకునేందుకు నిత్యావసర సరకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పేద ముస్లింలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.