VIDEO: మంథన్ గోడ్‌లో నూతన చలివేంద్రం ప్రారంభం
NRPT: వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామంలో బుధవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామ యువ నాయకుడు ఉప్పరి అశోక్ చొరవతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఉప సర్పంచ్ కుర్వ సాబెన, ఉప్పరి రాములు ప్రారంభించారు. ఎండలు ముదురుతున్న వేళ బాటసారులు, కూలీల దాహం తీర్చేందుకు ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టామని వారు తెలిపారు.