VIDEO: తిరుపతిలో బస్సుపై కూలిన కరెంట్ స్తంభం
తిరుపతి జిల్లాలో మంగళవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. కొందరు ఉద్యోగులతో వెంగారెడ్డి కండ్రిగ నుంచి అపాచీకి ఓ బస్సు బయల్దేరింది. వరదయ్య పాలెం జడ్పీ స్కూల్ వద్దకు రాగానే కరెంట్ స్తంభం విరిగి బస్సు మీద పడింది. అందులోని ఉద్యోగులు వెంటనే దిగేసి పరుగులు పెట్టారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సరఫరా నిలిపివేశారు.