కదిరి కూటమిలో భగ్గుమంటున్న విభేదాలు
సత్యసాయి: కదిరిలో కూటమి నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా BJP నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. స్వామి దర్శనానికి వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై విష్ణువర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. MLA కందికుంట ఆదేశాలతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని ఆయన బహిరంగంగా విమర్శించారు.