కడప జేసీ కీలక ఆదేశాలు

కడప జేసీ కీలక ఆదేశాలు

KDP: స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రణాళిక బద్ధంగా వృద్ధి సాధించాలని కడప జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ ఆదేశించారు. స్వర్ణాంధ్ర విజన్-2047పై కలెక్టరేట్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. లక్ష్యాలను చేరుకునేందుకు జిల్లా అభివృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో లక్ష్యాలను సంపూర్ణం చేయాలని సూచించారు.