30 వార్డును ఆకస్మిక తనిఖీలు

30 వార్డును ఆకస్మిక తనిఖీలు

నంద్యాల: పట్టణంలోని 30వ వార్డులో ఉన్న సచివాలయంను నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. సచివాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.