డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని సంగంలో పూజలు

డిప్యూటీ సీఎం త్వరగా కోలుకోవాలని సంగంలో పూజలు

NLR: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఇటీవల సర్జరీ జరిగింది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సంగంలో ఉన్న గంగమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆదివారం సంగం మండలం జనసేన సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ అస్వస్థత నుంచి కోలుకుని, తిరిగి ప్రజా క్షేత్రంలో మరింత శక్తివంతంగా సేవలు అందించాలని కోరుకున్నట్లు తెలిపారు.