రూరల్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన నిరంజన్ రెడ్డి

కరీంనగర్ రూరల్ సీఐ ప్రదీప్ కుమార్‌ను బదిలీ చేస్తూ ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నూతన కరీంనగర్ రూరల్ సీఐగా నిరంజన్ రెడ్డి బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇంతకు ముందు సీఐగా పని చేసిన ప్రదీప్ కుమార్‌ను ఐజి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.