ఇదే నా 'ఫ్యాన్ బాయ్ మోమెంట్': లోకేష్
క్రికెట్ దిగ్గజం సచిన్‌ను మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఇది ఒక 'ఫ్యాన్ బాయ్ మోమెంట్' అంటూ పోస్టు చేశారు. సచిన్ వినయం, మానవత్వం గురించి విన్నవన్నీ నిజమేనని, వాటిని ప్రత్యక్షంగా చూడటం గర్వకారణమని అన్నారు. తరతరాల క్రికెటర్లకు ప్రేరణగా నిలిచిన సచిన్, కేవలం క్రికెట్ దేవుడిగానే కాకుండా మానవత్వానికి ప్రతీక అని కొనియడారు.