సొసైటీ త్రిసభ్య కమిటీ బాధ్యతల స్వీకరణ

కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు పీఏసీఎస్ ఛైర్మన్‌గా, గరికపాటి శ్రీనివాసరావు, కమిటీ సభ్యులుగా బర్రె ఏడుకొండలు, నూనావత్ బేబీ సోమవారం సొసైటీలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, త్రిసభ్య కమిటీని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఆశయాల మేరకు సొసైటీలోని రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు.