అకస్మాత్తుగా బడ్డీలోంచి మంటలు
కృష్ణా: మచిలీపట్నంలోని చిలకలపూడి సీడబ్ల్యూసీ గోడౌన్ల వద్ద ఉన్న బడ్డీ శనివారం దగ్ధమైంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించిందనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.