'రైతులు లాభసాటి పంటలు పండించాలి'
PPM: రైతులు సాంప్రదాయ వ్యవసాయం విడనాడి లాభసాటి వ్యవసాయం వైపు మళ్లాలని ఎంపీటీసీ సభ్యురాలు అప్పికొండ రమాదేవి తెలిపారు. బుధవారం సాలూరు మండలం ఖరాసువలస గ్రామంలో రైతన్న మీకోసం గ్రామ సభ నిర్వహించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు అపరాలు సాగు చెయ్యాలని, రసాయనిక ఎరువులు వినియోగం తగ్గించి సేంద్రీయ ఎరువులు ఉపయోగించాలని కోరారు.