సైనిక సహాయనిధికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే విరాళం

సైనిక సహాయనిధికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే విరాళం

HYD: దేశ భద్రత కోసం సైనిక సహాయనిధికి రూ. 10 లక్షలు విరాళం ఇవ్వనున్నట్లు శనివారం కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులు ప్రకటించారు. భారత సైనికులకు అండగా ఉండేందుకు తమ వంతు సహాయంగా విరాళం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సమయంలో దేశంలోని ప్రతి పౌరుడు కూడా సైనికులకు అండగా నిలవాలని సూచించారు.