'టీబీ లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలి'
JGL: రాయికల్ మండలం ఆయిలాపూర్ OHCలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీబీ అభియాన్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంప్‌లో గ్రామస్తులకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 35 ఎక్స్-రేలు తీసి అనుమానితుల నుంచి స్ఫుటం నమూనాలు సేకరించారు. టీబీ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.