గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ
విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా డొంకాడ రామకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక గురజాడ కళాక్షేత్రంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ఇతర ప్రముఖులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.