రూ. 150 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు

రూ. 150 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా ఆరోపణలు

విశాఖపట్నం జోడుగుళ్లుపాలెంలో సుమారు రూ.150 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఆరోపణలు వెలువడ్డాయి. ఈ ఘటనపై స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేయగా, వైసీపీ నేత కె.కె రాజు మద్దతు తెలిపారు. భూకబ్జాల వెనుక రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, వెంటనే విచారణ చేసి ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేశారు.