హన్వాడ మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్

మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరిగాయి. మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో హన్వాడ మండల నాయకులు కొండా లక్ష్మయ్య పాల్గొన్నారు.