అకాల వర్షం దెబ్బకు రైతు విలవిల
ADB: బజార్ హత్నూర్ మండలంలోని బజార్ హత్నూర్, కొలహరి బాలన్‌పూర్ గ్రామాల్లో నిన్న కురిసిన అకాల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. మండలంలోని పంటపొలాల్లో మొక్కజొన్న, గోధుమ, జొన్న పంటలు విస్తారంగా నేలను తాకాయి. బజార్ హత్నూర్ గ్రామానికి చెందిన రైతు బొమ్మెత చందర్ తన 3 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా, అందులో 2 ఎకరాల పంట పూర్తిగా నేల కూలిపోయింది.