ఆర్టీసీ కార్మికులకు గొడుగులు పంపిణీ
NKL: కల్వకుర్తిలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు పట్టణ ఆర్యవైశ్య సంఘం అండగా నిలిచింది. ఎండ తీవ్రత దృష్ట్యా కార్మికులకు గొడుగులు పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకుంది. ఈ కార్యక్రమంలో సంఘం మాజీ మండలాధ్యక్షులు దాచేపల్లి శ్రీనివాసులు, ప్రస్తుత అధ్యక్షులు గంధం కిరణ్ ప్రసాద్ తదితరులు పాల్గొని, కార్మికుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.